కల్వకుంట్ల మిలన్ రావును అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు  - MicTv.in - Telugu News
mictv telugu

కల్వకుంట్ల మిలన్ రావును అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు 

December 10, 2019

Hyderabad bio-diversity flyover case accused not to arrest  arrest .

హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం కేసులో నిందితుడైన కల్వకుంట్ల కృష్ణ మిలన్ రావుకు హైకోర్టు ఈ రోజు ఊరటనిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ వరకు అతణ్ని అరెస్ట్ చేయకూడదని పొలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ చనిపోగా పలువురుగాయపడిన సంగతి తెలిసిందే. 

తాను అతివేగంతో కారు నడపలేదని మిలన్ రావు కోర్టుకు చెప్పాడు. తాను 40 నుంచి 50 కి.మీ. వేగంతోనే ప్రయాణించానని, ఫ్లైఓవర్ డిజైన్ సరిగ్గా లేకపోవడం వల్ల కారు అదుపుతప్పి కింద పడిందని వివరించాడు. ఫ్లైఓవర్‌పై S రూపంలో ఉన్న మలుపు వల్లే ప్రమాదం జరిగిందని తెలిపాడు. వాదనలు విన్న కోర్టు కేసు విచారణను 12కు వాయిదా వేస్తూ అంతవరకు నిందితుణ్ని అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.   అయితే అతడు గంటకు 104 కి.మీ. వేగంతో ప్రయాణించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. జరిమానా కూడా విధించారు. వంతెనపై వేగ పరిమితి 40 కి.మీ. మాత్రమే. గాలి బుడగలు తెరుచుకోవడంతో మిలన్ రావు ప్రమాదం నుంచ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. అతడు ఓ ప్రైవేటు కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నాడు.