కత్తి మహేష్ అరెస్ట్.. రాముడిపై వ్యాఖ్యల ఎఫెక్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

కత్తి మహేష్ అరెస్ట్.. రాముడిపై వ్యాఖ్యల ఎఫెక్ట్

August 14, 2020

Hyderabad CCS Police Arrest Kathi Mahesh

సినీ విమర్శకుడు, పవన్ కళ్యాన్‌పై తరుచూ విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచిన కత్తి మహేశ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరాముడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతనికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు చేశారని గతంలో ఫిర్యాదులు రావడంతో ఆయనతో పాటు పలువురిపై చర్యలు చేపట్టారు. 

ఏడాది ఫిబ్రవరి నెలలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన బహుజన రచయితల సమావేశంలో ఆయన  రాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. దీనితో పాటు ఇటీవల కూడా శ్రీరాముడిపై ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ చేశారంటూ హిందూ సంఘాల ప్రతినిధులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వీటి ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు. కాగా గతంలో ఆయనపై ఆరు నెలల పాటు హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కర విధించిన సంగతి తెలిసిందే.