అత్యాచార యత్నం.. హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ సస్పెండ్ - MicTv.in - Telugu News
mictv telugu

అత్యాచార యత్నం.. హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ సస్పెండ్

December 3, 2022

విదేశీ విద్యార్ధినిపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవిరంజన్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. రంజన్‌ను శిక్షించాలని విద్యార్థులు భారీ ఆందోళనకు దిగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్ అమలు కాలంలో ఆయన హైదరాబాద్ నుంచి తమ అనుమతి లేకుండా బయటికి వెళ్లకూడదని రిజిస్ట్రార్ ఆదేశించారు. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.

స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ విభాగంలో పనిచేస్తున్న రంజన్ థాయ్‌లాండ్ విద్యార్థినిపై కొన్నాళ్లుగా కన్నేశాడు. హిందీ నేర్పిస్తానని గురువారం రాత్రి కారులో ఇంటికి తీసుకెళ్లి మద్యం తాగించాడు. లైంగికంగా వేధించడంతో ఆమె ప్రతిఘటించింది. రంజన్ ఆమెపై దాడి చేశాడు. బాధితురాలి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రవి రంజన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. రవిరంజన్ గతంలోనూ పలువురు విద్యార్థులను వేధించినట్లు తెలుస్తోంది

 

ఇది కూడా చదవండి : సోషల్ మీడియా స్టార్ హఠాన్మరణం..విషాదంలో ఫ్యాన్స్