హైదరాబాదాద్ సిటీ బస్సులు.. రేపట్నుంచి రోడ్లపైకి...  - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాదాద్ సిటీ బస్సులు.. రేపట్నుంచి రోడ్లపైకి… 

September 24, 2020

Hyderabad city buses restarts form tomorrow .

హైదరాబాద్ నగర ప్రజలకు అధికారులు శుభవార్త చెప్పారు. నిన్నటి నుంచి శివారు ప్రాంతాలకు సిటీ బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించిన ఆర్టీసీ రేపటి నుంచి(శుక్రవారం) సిటీ లోపల కూడా తిప్పనుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నగరంలో 25 శాతం బస్సులను తిప్పనున్నారు. కరోనా వల్ల  మార్చి 22 నుంచి సిటీ బస్సులు డిపోల్లోనే మూలుగుతున్నాయి. 

అన్‌లాక్ ప్రక్రియ ఊపందుకోవడం, మెట్రో రైల్ సర్వీసులు కూడా తిరిగి ప్రారంభం కావడంతో సిటీ బస్సులను కూడా రోడ్డెక్కించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.  రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ వంటి డిపోల నుంచి బస్సు సర్వీసులు బుధవారం ప్రారంభమయ్యాయి.  ఒక్కో డిపోకు సరాసరిన 12 బస్సుల చొప్పున ఆర్టీసీ నడుపుతోంది. కాగా, మెట్రో అందరికీ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆటోలను ఆశ్రయిస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. రాష్ట్రంలో జిల్లాలకు ఇప్పటికే సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఏపీ, తెలంగాణల మధ్య బస్సులను నడిపే అంశంపై పీటముడి పడ్డంతో అంతర్రాష్ట్ర సర్వీసులు నడవడం లేదు. దీంతో ప్రైవేటు బస్సులు ధరలు పెంచి ప్రయాణికులను దోచుకుంటున్నాయి. భౌతిక దూరం కూడా పాటించకుండా సర్వీసులు తిప్పుతున్నాయి. అధికారులకు ఈ సంగతి తెలిసినా పట్టించుకోవడం లేదు.