రైట్.. రైట్.. హైదరాబాద్‌లో రోడ్డెక్కిన సిటీ బస్సులు  - MicTv.in - Telugu News
mictv telugu

రైట్.. రైట్.. హైదరాబాద్‌లో రోడ్డెక్కిన సిటీ బస్సులు 

September 25, 2020

vnvm

హైదరాబాద్‌లో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. దాదాపు 185 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సర్వీసులు మొదలయ్యాయి. ఉదయం 5 గంటలకే డ్రైవర్లు, కండక్టర్లు డిపోలకు చేరుకున్నారు. తొలిదశలో కేవలం 25శాతం మాత్రమే అన్ని రూట్లలో అందుబాటులోకి తెచ్చారు. దీంతో గ్రేటర్ పరిధిలో 29 డిపోల్లో సుమారు 2,900 బస్సులు సహా అన్ని రీజినల్ డిపోలు కలిసి 4600 బస్సులు ఉండగా వీటిలో సుమారు 650 బస్సులు నడవనున్నాయి. 

పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను ఎక్కించుకోనున్నారు. సిటి బస్సు ఎక్కే ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మాస్కు ఉంటేనే బస్సులోకి అనుమతిస్తామని తెలిపారు. బస్సుల్లో డ్రైవర్,కండక్టర్‌కు శానిటైజర్లను కూడా డిపో మేనేజర్లు అందజేశారు. పది రోజుల తర్వాత నుంచి 50 శాతం బస్సులను అనుమతించనున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కొన్ని అంతర్రాష్ట బస్సు సర్వీసులను కూడా అనుమతి ఇచ్చారు. కర్నాటక, మహారాష్ట్ర రూట్లలో వీటిని నడుపుతున్నారు. ఇక ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసుల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.