దేశవ్యాప్తంగా చలిపులి పంజా పంజా విసురుతోంది. పొగమంచు కూడా జడలు విప్పుతోంది. పలుచోట్ల ఉదయం పూట దారి సరిగ్గా కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే శుక్రవారం వరకు చలిగాలులు తీవ్రంగా ఉంటాయనని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. హైదరాబాద్‌లో వచ్చే నాలుగు రోజుల్లో కనీస ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండొచ్చని ఐఎండీ అంచనా వేసింది. నగరంలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 14.5 డిగ్రీల సెల్సియస్‌గా, ఆదిలాబాద్‌లో 9.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హన్మకొండ, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్గిరి, సిద్దిపేట, వరంగల్ తదిరత జిల్లాలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. ఎల్లో అలర్ట్ ఈ జిల్లాలకు కూడా వర్తిస్తుంది. అలాగే మెదక్, కొమరంభీమ్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌లో ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోయే అవకాశముందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఉదయంపూట రోడ్లలో పొగమంచు కమ్ముకుని ఉండడంతో వాహనాలను జాగ్రత్తగా నడపాలి. ముఖ్యంగా ఊరిబయట ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు దారిని స్పష్టంగా గమనించాలి. హైదరాబాద్‌లో చలి బాగా పెరగడతో జనం పొద్దుటిపూట ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. ఉన్నిదుస్తుల అమ్మకాలు ఊపందుకున్నాయి.