నగరంలో 20 వేల జీతగాడు..! - MicTv.in - Telugu News
mictv telugu

నగరంలో 20 వేల జీతగాడు..!

June 23, 2017

నెలకు 30వేల జీతం వస్తే ఫర్యాలేదు..50వేల జీతం వస్తే బెటర్.లక్షకు పైగా వస్తే బిందాస్. లైఫ్ అంటే ఇలాగే ఉండాలి. లగ్జరీగా బతికేయాలి. కోరిందల్లా కొనేలా ఉంటేనే హైఫై లైఫ్. చేతిలో స్మార్ట్ ఫోర్ట్..పర్సు నిండా పింక్ నోట్లు..నెల వచ్చేదాకా నో అప్పుస్. అందరూ ఇలాగే ఉండాలనుకున్నా..కొందరికే ఇది సాధ్యం.మరి హైదరాబాద్ లో 20 వేల జీతాగాడి పరిస్థితి ఎలా ఉంటుంది.?సిటీలో 20 వేలతో బతికేయొచ్చా..?పిల్లల చదవులేంటీ..పాల ప్యాకెట్లు, కూరగాయలు, కిరణా ఖర్చులు ఎలా…?20వేలతో నెల అంతా గడుస్తుందా..?

హైదరాబాద్ బెస్ట్ లివింగ్ సిటీ. ఉపాధికి కేరాఫ్ అడ్రస్. పల్లెలో పనికరువై పొట్టచేతపట్టుకుని వస్తే పట్నం అమ్మలా ఆదరిస్తుంది. నాన్నలా ప్రేమను కురిపిస్తుంది. అన్నలా పనికల్పిస్తుంది. తోడబుట్టువులా తోడునీడై ఉంటుంది. కానీ అన్ని ధరలు పెరుగుతున్నా కూలీ ధరలు పెరుగకపాయె. ఎక్కడైనా కంపెనీలో పనిచేసినా పది, ఇరవై వేలకు మించిరాకపాయె. ఎంత తోపు కంపెనీలో పనిచేస్తున్నా 20 వేల రూపాయలు క్రాస్ కావడం లేదు. ఎన్ని ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్నా అంతే. కొత్తగా జాబ్ లో చేరితే పదివేలు..ఎక్స్ పీరియన్స్ ఉంటే 20 వేల లోపే..ఈ పైసలతో నగరంలో ఎలా బతికేదెలా..?పిల్లా జెల్లా ఉంటే గడిచేదెలా…

నెలకు వచ్చే 20 వేలను ఎలా సర్దుతాడో ఓ సారి చూద్దాం. సిటీలో ఎంత లేదన్నా..ఏ ఏరియా అయినా సింగిల్ రూమ్ అయితే 2వేలు..డబుల్ రూమ్ అయితే 4వేలపైనే.ఇద్దరు పిల్లలు ఉంటే డబుల్ రూమ్ కంపల్సరీ..లేదంటే సింగిల్ రూమ్ లోనే అడ్జస్ట్ అవుతాడు. కూరగాయల ఖర్చు వారానికో మూడు వందలు.. నెలకు 12 వందలు. కిరణా ఖర్చులు ఎంతలేదన్నా 3వేలు. అరలీటర్ పాలప్యాకెట్ 22 రూపాయలు..అంటే నెలకు 660 రూపాయలు.. ఇక ఇద్దరు పిల్లలు ఉంటే…వారు స్కూల్ కెళ్లే స్టేజ్ లో ఉంటే ..ఇద్దరికి ఎంత మామూలు స్కూల్ అయినా నెలకు 15 వందలపైనే..ఇద్దరుంటే మూడు వేలు తప్పవు. ఇక తాను కొలువుకు పోవాలంటే ఎంత దగ్గరున్నా ఆటో, బస్సు చార్జీలు గానీ , బండి పెట్రోలు గానీ తక్కువలో తక్కువ 15 వందలు అవుతుంది. ఫోన్ , కేబుల్ టీవీ, కరెంట్ బిల్లులు వెయ్యికి పైగా అవుతాయి.ఇక ముందుచూపుతో ఓ యాభై వేల చిటీ వేస్తే నెలకు మూడు వేలు అవుతుంది. ఏటైమ్ లో ఏ అవసరం వస్తుందోనని వెయ్యి చేతిలో ఉంచుకుంటాడు. ఇంత పొదుపుగా ఖర్చుపెడితేనే 20 వేలు చాలవు. నెలలో ఎదైనా ఫంక్షన్ పడితే అప్పులు తప్పవు. అనుకోకుండా హాస్పిటల్ కు వెళ్లాల్సి వస్తే అంతే.

బెస్ట్ లివింగ్ సిటీలో 20 వేలతో బతకడం చాలా కష్టం.ఎంత అడ్జస్ట్ అయినా తిప్పలు తప్పవు. అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి. నిత్యవసరాలు కొనలేనంత రేంజ్ కు పోతున్నాయి. అన్ని పెరుగుతున్నా…జీతాలు మాత్రం పెరగడం లేదు. ఇక్కడ తీసేస్తే అక్కడకు… అక్కడ తీసేస్తే ఇక్కడకు మారాలి తప్ప జీతాలు పెరగడం లేదు. సిటీ కంపెనీల్లో అన్నింట్లో ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. సర్కార్ సంక్షేమ పథకాలు సామాన్యుడి దరిచేరడం లేదు. ఏదో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చినా చింతలేకుండా బతుకొచ్చు అనుకుంటాడు. కానీ అవీ రాకపోయే..నగరంలో చాలీచాలనీ జీతాలతో బతికెదెట్లా…బతుకు జట్కా బండి లాగేదెలా..?సీఎం కేసీఆర్ సారూ…ప్రైవేట్ జాబ్ అయినా కనీసం పాతిక వేలు కంపల్సరీ ఇచ్చేటట్టు ఓ రూల్ పెట్టండి..అప్పుడే సామాన్యుడి బండి గాడిలో ఉంటుంది.