Home > Featured > బరువు తగ్గిస్తామంటూ ప్రకటనలు.. కలర్స్ హెల్త్ కేర్‌కు భారీ జరిమానా

బరువు తగ్గిస్తామంటూ ప్రకటనలు.. కలర్స్ హెల్త్ కేర్‌కు భారీ జరిమానా

అధిక బరువుతో బాధపడుతున్నారా…? కొద్ది రోజుల్లోనే నాజుకైన శరీరం మీ సొంతం.. తక్కువ రోజుల్లోనే కేజీల లెక్కన బరువు తగ్గొచ్చు. కలర్స్ హెల్త్ కేర్ ఇచ్చిన ప్రకటన చూసి ఓ యువతి మోసపోయింది. తన పెళ్లి కుదరడానికి అడ్గుగా ఉన్న తన బరువు సమస్యకు ఈజీగా చెక్ పెట్టేయొచ్చనే ఉద్దేశంతో ఆ సంస్థలో జాయిన్ అయింది. రూ. 80 వలే చెల్లించి.. అందులో ట్రీట్మెంట్ తీసుకుంది. మూడు నెలలైనా ఎలాంటి ఫలితం లేకపోవడంతో మోసపోయనట్లు గ్రహించి వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించింది. ఆ సంస్థకు వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చేలా తీర్పునిచ్చింది.

వనపర్తికి చెందిన యువతి రుక్సర్‌నాజ్‌.. పెళ్లి కుదరడానికి అధిక బరువు సమస్యగా మారడంతో అత్తాపూర్‌లోని ప్రతివాద సంస్థను సంప్రదించింది. రూ.80వేలు చెల్లించి చికిత్స తీసుకుంటే 20 కిలోల బరువు తగ్గుతావని ఆ సంస్థవారు చెప్పారు. మూడు నెలల్లో ఫలితం లేకపోవడంతో తన డబ్బు తిరిగి చెల్లించాలని కోరగా సంస్థ స్పందించలేదు. దీంతో యువతి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఆ ఫిర్యాదుపై విచారించిన కమిషన్‌-3 బెంచ్‌ సాక్ష్యాలు పరిశీలించి రూ.80వేలు, 12 శాతం వడ్డీతో, పరిహారం రూ.10వేలు, ఖర్చులు రూ.5వేలు చెల్లించాలని కలర్స్‌ను ఆదేశించింది.

Updated : 19 July 2022 2:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top