హైదరాబాద్‌లో కంటైన్మెంట్ ప్రాంతాలు ఇవే..  - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో కంటైన్మెంట్ ప్రాంతాలు ఇవే.. 

May 19, 2020

Hyderabad covid containments list

తెలంగాణలో కంటైన్మెంట్ ప్రాంతాలు ఉన్న జిల్లాలు మినహా మిగతావన్నీ గ్రీన్ జోన్లేనని సీఎం కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే. కేసులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ రెడ్ జోన్లో ఉందని, నగరంలోlr కంటైన్మెంట్ ఏరియాల్లో మినహా అన్నిచోట్లా అన్ని షాపులను సరిబేరి విధానంలో తెరుచుకోవచ్చని అన్నారు. కంటైన్మెంట్ ఏరియాల్లో ఎలాంటి వ్యాపారాలు ఉండవని, అక్కడి ప్రజలకు అవసరమైన సరుకులను పోలీసులే తీసుకొస్తారని చెప్పారు. లాక్ డౌన్ ఆంక్షలు అన్ని ప్రాంతాల్లో కొనసాగుతాయన్నారు. ఆయా ప్రాంతాల్లో కంటైన్మెంట్ ఉన్న వీధులను, కాలనీల వివరాలను జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది.

కంటైన్మెంట్లు ఉన్న ప్రాంతాల ఇవే

రాచకొండ పరిధిలోని ఆదిభట్ల, చైతన్యపురి, బాలాపూర్, మాహేశ్వరం, సరూర్ నగర్, వనస్థలిపురం, పహాడీ షరీఫ్, నాచారం, మల్కాజ్ గిరిలోని కంటైన్మెంట్ ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలో కంచన్ బాగ్, మాదన్నపేట్, రెయిన్ బజార్, మీర్ చౌక్, డబీర్ పురా, చాంద్రాయణగుట్ట, సైఫాబాద్, నాంపల్లి, రాంగోపాల్ పేట్, చిక్కడపల్లి, నారాయణగూడ, నల్లకుంట, ఓయూ,సైదాబాద్, చాదర్ ఘాట్, బేగంపేట్, చిలకలగూడ, తుకారం గేట్, లాలాగూడ, పంజగుట్ట, ఎస్సార్ నగర్, హబీబ్ నగర్, లంగర్ హౌస్, హుమయూన్ నగర్, గోల్కొండ, కుల్సుంపురా, ఆసిఫ్ నగర్, టప్పాచబుత్రా, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఆల్వాల్, జగద్గిరిగుట్ట, షామీర్ పేట్, కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, నార్సింగి, రాయదుర్గం, ఆర్సీపురం, చందానగర్, మైలార్ దేవ్ పల్లి, రాజేంద్రనగర్ ఏరియాల్లో కంటైన్మెంట్ ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ లింకులో చూసుకోవచ్చు. 

List of Containment zones