పక్కా ప్లాన్‌తో ప్రియాంకపై హత్యాచారం..నలుగురి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

పక్కా ప్లాన్‌తో ప్రియాంకపై హత్యాచారం..నలుగురి అరెస్ట్

November 29, 2019

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియాంకారెడ్డి హత్యాచారం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వారంతా పక్కా ప్రణాళిక ప్రకారమే ఆమెను అపహరించి, హత్యాచారానికి పాల్పడ్డారని తెలిసింది. ప్రియాంకారెడ్డి స్కూటీని నిందితులు ఉద్దేశపూర్వకంగానే పంక్చర్‌ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని సమాచారం. టోల్ గేట్ వద్ద ప్రియాంకారెడ్డి తన బైక్‌ను పార్క్ చేసి వెళ్లడాన్ని నిందితులు గమనించారు. ఆమె తిరిగిరాక ముందే ఆ స్కూటీ టైర్‌ను పంక్చర్ చేశారు. ఆమె వచ్చిన తరువాత స్కూటీ టైర్ పంక్చర్ అయిందని సాయం చేస్తున్నట్లు నటించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఆమెపై ఘాతుకానికి పాల్పడ్డారని తెలిసింది. 

Hyderabad.

ప్రియాంకను లారీ డ్రైవర్లతోపాటు క్లీనర్లు కలిసి అతికిరకంగా గ్యాంగ్ రేప్ చేశారని పోలీసులు గుర్తించారు. ఆ తరువాత హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. నిందితులను మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. నిందితుల్లో ఇద్దరిని రంగారెడ్డి జిల్లాకు చెందిన మహబూబ్‌, మహ్మద్‌ షాషాలుగా గుర్తించారు. టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తెల్లవారుజామున 3-4 గంటల మధ్య సమయంలో హత్యచేసి ఉంటారని శవపరీక్షలో తేలిందన్నారు. ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం ప్రియాంకారెడ్డిని దుప్పటిలో చుట్టి కిరోసిన్‌ పోసి తగలబెట్టినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రియాంకరెడ్డి తలపైనా వైద్యులు గాయాన్ని గుర్తించారు. ప్రియాంక శరీరం గంటపాటు కాలినట్లు డాక్టర్లు భావిస్తున్నారు. మెడను చున్నీతో బిగించి హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.