Hyderabad: Drugged and sexually assaulted a girl
mictv telugu

హైదరాబాద్‌లో దారుణం..బాలికకు మత్తుమందు ఇచ్చి,లాడ్జీలో

September 15, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ 13 ఏళ్ల బాలికకు మత్తుమందు ఇచ్చి ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. రెండు రోజులుగా బాలిక కన్పించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు డబీర్‌పుర పోలీసులు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..”హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఈ ఘటన జరిగింది. 13 ఏళ్ల బాలికకు మత్తుమందు ఇచ్చి ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. చంచల్ గూడకు చెందిన ఓ మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. మాయమాటలతో ఆమెను నాంపల్లిలోని ఓ లాడ్జికి తీసుకెళ్లారు. బాలికకు మత్తుమందు ఇచ్చి రెండ్రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను అక్కడే వదిలేసి పరారయ్యారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశాం. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. అయితే, నిందితులిద్దరూ బాధితురాలికి తెలిసినవారే కావడం గమనార్హం. విచారణ చేస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే వెల్లడిస్తాం” అని పోలీసులు తెలిపారు.

అనంతరం బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. అయితే, నిందితులు బాధితురాలికి తెలిసినవారేనని పోలీసులు తెలుపడంతో బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని అధికారులను వేడుకున్నారు.