హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని ఫామ్ హౌసుల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు ఉప్పందడంతో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. సోమవారం 32 ఫామ్ హౌసుల్లో సోదాలు చేయగా పలు చోట్ల అసాంఘిక కార్యక్రమాలు జరిగినట్లు తేలిసింది. భారీ మొత్తంలో నగదు, మద్యం సీసాలను, హక్కా, పేకాట్ సామగ్రిని, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 26 మందిని అరెస్ట్ చేశారు. అనైతిక కార్యక్రమాలతోపాటు బెట్టింగులకు కూడా పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొయినాబాద్‌లోని బిగ్ బాస్ ఫామ్‌హౌస్, జహంగీర్ డ్రీమ్ వ్యాలీ, రిప్లెజ్ ఫామ్ హౌస్(శంషాబాద్), గోవర్ధన్ రెడ్డి ఫామ్ హౌస్(మేడ్చల్) తదితర చోట్లు అసాంఘిక కార్యక్రమాలు జరిగాయని సమాచారం.