హైదరాబాద్‌లో పడవ మునక.. ఓవర్‌లోడ్ ఎఫెక్ట్..  - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో పడవ మునక.. ఓవర్‌లోడ్ ఎఫెక్ట్.. 

October 15, 2020

Hyderabad flood boat capsized in old city

హైదరాబాద్ వరదలు భారీ ఆస్తినష్టాన్ని, ప్రాణానష్టాన్ని మిగిల్చాయి. ఈ రోజు కొద్దిగా తేరుకుంటున్న నగరంలో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పాతబస్తీ ఫలక్‌నుమాలో వరద బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న పడవ ఒకటి బోల్తాపడింది. సామర్థ్యానికి మించి మనుషులను ఎక్కించుకోవడంతో అది కాస్తా తిరగబడింది. దాదాపు మెడలోతు నీళ్లలో పడవ మునగడంతో అందులోని పిల్లలు సహా అందరూ నీళ్లలో పడిపోయారు. 

దగ్గర్లోనే ఉన్న జీహెచ్ఎంసీ సిబ్బంది హుటాహుటిన వారిని కాపాడడంతో ప్రాణనష్టం తప్పింది. చిన్నబోటులో అంతమందిని ఎలా ఎక్కిస్తారని విమర్శలు వస్తున్నాయి. వరదల కంటే ఇలాంటి నిర్లక్ష్యాలే చంపేసేలా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా, వరద బాధితులకు యుద్ధప్రాతిపదికన సాయం చేయాలని, నష్టంపై నివేదికలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈయన రోజు సంబధిత శాఖల మంత్రులు, అధికారులతో వరద పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణలో వరదల కారణంగా దాదాపు 50 మంది చనిపోయారని అంచనా. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు.