హైరాబాద్‌లో వరద విలయం సృష్టించింది. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా విషాదమే కనిపించింది. చుట్టపు చూపుగా వచ్చిన ఓ వ్యక్తికి తీవ్ర విషాదం మిగిల్చింది. భార్యా బిడ్డలు నీటిలో కొట్టుకుపోవడంతో ఒంటరి అయిపోయాడు. గగన్‌పహాడ్‌లో జరిగిన ఈ సంఘటన పలువురిని కలిచి వేసింది. ప్రాణాలు కోల్పోవడానికే తాము ఇక్కడికి వరు వచ్చినట్టు ఉందని ఆవేదన చెందుతున్నాడు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన మహ్మద్ సాదిక్ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవలే భార్య కరీమా, కుమారులు ఆయాన్ (7), అమేర్ (4) కూతురుతో కలిసి అత్తారింటికి వచ్చాడు. అంతా ఆనందంగా గడిపిన తర్వాత నిద్రపోతూ ఉండగా ఒక్కసారిగా వర్షం ఊపందుకుంది. వరద పోటెత్తడంతో అప్పచెరువు నుంచి ఇంటిలోకి వరద తన్నుకువచ్చింది. ఆ ప్రవాహానికి బావమరిది అమీర్‌ఖాన్ భార్య, పిల్లలు, కొట్టుకుపోయారు. ఆయాన్ ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. కూతురును కాపాడుకోవడం కోసం అతడు ఫ్రిజ్ ఎక్కి కూర్చోవడంతో వారికి ప్రమాదం తప్పింది.