హైదరాబాద్ ముంపు ప్రజలకు మరో హెచ్చరిక - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ ముంపు ప్రజలకు మరో హెచ్చరిక

October 16, 2020

Hyderabad Floods: HMWSSB appeals to public to clear water stored in sumps

ఆకాశానికి చిల్లులు పడ్డట్టు కురిసిన భారీ వర్షానికి నగరవాసులు ఉలిక్కిపడ్డారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. భారీ వరదలతో పూర్తిగా హైదరాబాద్ నగరం మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్ళిపోయింది. పాతబస్తీ ప్రాంతంలో కొన్ని ఇళ్లు కూలిపోయాయి. కొంతమంది వీధుల్లో నదుల్లా పారుతున్న వరదకు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పియారు. రోడ్లు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. బురద మేటలు ఇళ్లల్లో తిష్టవేశాయి. దీంతో ఇళ్లల్లోని ప్రజలు ఇంకా అవస్థలు పడుతున్నారు. వర్షం తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే హైదరాబాద్ నగరం వరద నీటి నుంచి కోలుకుంటున్నారు. 

ఈ క్రమంలో హైదరాబాద్ ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు పలు కీలక సూచనలు చేశారు. వర్షం కారణంగా వచ్చిన భారీ వరదల కారణంగా మంచినీటి ట్యాపులు, ట్యాంకులు పూర్తిగా మునిగిపోయాయి. ఈ కారణంగా ప్రస్తుతం వరద నీటితో మునిగిన వాటన్నింటిని బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేసుకోవడంతో పాటు.. క్లోరిన్ కూడా వాడాలి అని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి ఇంటికి అధికారులు బ్లీచింగ్ పౌడర్ క్లోరిన్ సరఫరా చేస్తున్నారు. కలుషితం అయిన నీటిని తాగడం వల్ల కొత్త అనారోగ్య సమస్యలు రావచ్చు అని అధికారులు చెబుతున్నారు.