Home > Featured > రౌడ్ షీట్ ఎత్తేశారన్న ఆనందం.. అమ్మాయిలతో రేవ్ పార్టీ

రౌడ్ షీట్ ఎత్తేశారన్న ఆనందం.. అమ్మాయిలతో రేవ్ పార్టీ

కుక్క తోక వంకరే అన్నట్లుగా.. ఓ రౌడీ షీటర్ బుద్ది స్టేషన్‌కి వెళ్లినా మారలేదు. అతడు చేసే పనుల కారణంగా పోలీసులు రౌడీ షీట్ తెరిస్తే.. ఉన్నతాధికారులు ఆ రౌడీషీట్‌ను తొలగించారు. ఆ ఆనందం పట్టలేని ఆ ‘మాజీ’ రౌడీషీటర్ శనివారం రాత్రి తన ఫ్రెండ్స్‌కి యువతులతో కలిసి రేవ్ పార్టీని ఏర్పాటు చేశాడు. శంషాబాద్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీం సడెన్ ఎంట్రీతో ఆ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ పార్టీకి వచ్చిన మొత్తం 48మందిని అరెస్ట్ చేశారు.

శంషాబాద్ ఇన్ స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్ దేవ్ పల్లికి చెందిన బాబాఖాన్ రౌడీ పనులకు పాల్పడుతుండటంతో అతని మీద రౌడీషీట్ తెరిచారు. ఇటీవల అతని మీద నమోదైన రౌడీషీట్ ను ఉన్నతాధికారులు తొలగించారు. ఈ సంతోషంలో శంషాబాద్ రామాంజపూర్ లోని సలీం వ్యవసాయ క్షేత్రంలో తన ఫ్రెండ్స్‌కు రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. దీనిపై పోలీసులు దాడి చేశారు. నలుగురు రౌడీషీటర్లు, 40మంది యువతీ యువకులను, నలుగురు హిజ్రాలను అరెస్ట్ చేశారు. వారి నుంచి కత్తులు, హుక్కా పరికరాలు, ఫోన్లు, టూ వీలర్లు, కార్లు, స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ పార్టీలో నలుగురు రౌడీ షీటర్లు యాసీన్, మహబూబ్, అజరు, సోహైల్ కూడా పాల్గొన్నారు. విచారణ నిమిత్తం నిందితులను శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు.

Updated : 6 Nov 2022 10:57 PM GMT
Tags:    
Next Story
Share it
Top