బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ బంద్.. 5 లక్షల పరిహారం - MicTv.in - Telugu News
mictv telugu

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ బంద్.. 5 లక్షల పరిహారం

November 23, 2019

Hyderabad gachibowli flyover accident 

హైదరాబాద్ గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై నుంచి కారు కిందపడి ప్రాణం తీసిన ఘటన కలకలం సృష్టిస్తోంది. డిజైనింగ్, నిర్వహణ సరిగ్గా లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రమాదంపై  ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. అఃతి వేగమే దీనికి కారణం కావొచ్చని అన్నారు.

 ఫ్లైఓవర్‌పై వేగాన్ని తగ్గించి, రక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. చీఫ్‌ ఇంజినీర్ల సూచనతో ఫ్లైఓవర్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ప్రమాదంపై మేయర్ బొంతు రామ్మోహన్ కూడా విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన సత్యవేణి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ఇస్తామని తెలిపారు. పరిస్థితి అంచనా వేయడానికి మూడు రోజుల పాటు ఫ్లైఓవర్‌పై రాకపోకలు నిలిపేస్తామన్నారు.ఈ రోజలు ఉదయం వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడ్డంతో సత్యవేణి చనిపోగా మరో ఏడుగురు గాయపడ్డారు.