గచ్చిబౌలి కొత్త ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ కారు.. రోడ్డుపై ఉన్న మహిళ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

గచ్చిబౌలి కొత్త ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ కారు.. రోడ్డుపై ఉన్న మహిళ మృతి

November 23, 2019

గచ్చిబౌలిలో ఈ రోజు ఘోర ప్రమాదం జరిగింది. బయో డైవర్సిటీ పార్కు ఫ్లైఓవర్‌పై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై వెళ్తున్న మహిళ అక్కడికక్కడే చనిపోగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్లైఓవర్ ప్రారంభించి నెల రోజులు కాగా ఇది రెండో ప్రమాదం. 

Hyderabad gachibowli.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. 100 కి.మీ. వేగంతో వెళ్తూ కిందపడింది. రోడ్డుపైన కూతురితో కలిసి ఆటో కోసం ఎదురు చూస్తున్న సత్యవేణి అనే మహిళపై పడిపోవడంతో ఆమె చనిపోయింది. కూతురు ప్రణీతతోపాటు మరో బాలరాజు, కుప్రా, మరో ఇద్దరు గాయపడ్డారు. కారు నడుపుతున్న వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గత వారం ఫ్లైఓవర్‌పై ఇద్దరు యువకులు సెల్ఫీ తీసుకుంటుండగా ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడే చనిపోయారు. కారులోని వ్యక్తులు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. 

గచ్చిబౌలి కొత్త ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ కారు.. రోడ్డుపై ఉన్న మృతి

Posted by Satyavathi Satya on Saturday, 23 November 2019