హైదరాబాద్‌లో లంచాల ఎస్సై అరెస్ట్.. ఎంత తీసుకున్నాడంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో లంచాల ఎస్సై అరెస్ట్.. ఎంత తీసుకున్నాడంటే..

October 28, 2020

హైదరాబాద్‌లో ఓ లంచాల పోలీసు అధికారి అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా పని చేస్తున్న లక్ష్మీనారాయణను బుధవారం రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో రూ. 30 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఈ వ్యవహారంలో ఎస్సైతో పాటు కానిస్టేబుల్ నరేశ్‌పై కేసు నమోదు చేశారు. నగదును సీజ్ చేసి ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. 

ఫోర్జరీ కేసులో కండిషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్సై లక్ష్మీ నారాయణ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. ముందుగా రూ. 30 వేలు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. పక్కాగా ఫ్లాన్ చేసిన ఏసీబీ కానిస్టేబుల్ పనిచేస్తున్న నరేష్‌కు 30 వేల రూపాయల నగదు ఇస్తుండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని విచారించిన ఆ తర్వాత కేసు నమోదు చేశారు. ఎస్సై అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోవడంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కలకలం రేగింది. కాగా, లక్ష్మీ నారాయణ 2014 బ్యాచ్‌కు చెందిన అధికారిగా వెల్లడించారు.