చీకటి తప్పు.. అలీకి బదులు ఫరాన్‌ను చంపేశారు! - MicTv.in - Telugu News
mictv telugu

చీకటి తప్పు.. అలీకి బదులు ఫరాన్‌ను చంపేశారు!

September 24, 2020

Hyderabad gang war incident

హైదరాబాద్‌లో జరిగిన గ్యాంగ్ వార్‌లో ఓ అమాయక యువకుడు బలయ్యాడు. బాలాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. షాహిన్‌నగర్‌ వాది-ఎ-ముస్తఫాలో ఉండే షాహిన్‌ సయ్యద్‌ మోమిన్‌ అలి(24) మంగళవారం రాత్రి తన ఫ్రెండ్ ఫరాన్‌ ఇంట్లో ఉన్నాడు. బుధవారం తెల్లవారుజామున ఆకలిగా ఉందని తినడానికి ఏమైనా తేవాలంటూ ఫరాన్‌ తన బైక్ ఇచ్చి అలి, మరో ఫ్రెండ్ ఖాలెద్‌ను బయటికి పంపించాడు. వారు బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా నలుగురు యువకులు వాహనంపై వచ్చి అలిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో వెనకాల కూర్చున్న ఖాలెద్‌ బైక్ దిగి పారిపోయాడు. 

దాడి తరువాత దుండగులు కూడా అక్కడి నుంచి పరారయ్యారు. రక్తం మడుగులో ఉన్న అలీని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే లోపే స్థానికులు అలిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యలోనే అతడు మరణించాడు. ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్, ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ సురేందర్‌లు సంఘటనా స్థలిని పరిశీలించారు. హత్యకు గురైన యువకుడు అమాయకుడని పోలీసులు తెలుసుకున్నారు. అలిని పంపించిన ఫరాన్‌ పహాడీషరీఫ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాడు. సబ్బుల ఫ్యాక్టరీ ఉందని ఫరాన్‌ కొందరిని నమ్మించి రూ.18లక్షలు వసూలు చేసినట్లు పహాడీషరీఫ్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైవుంది. దీంతో అలిని కాకుండా ఫరాన్‌ను చంపడానికి నిందితులు వచ్చారని పోలీస్ భావిస్తున్నారు.