Hyderabad: Girl student allegedly attacked by stalker with knife near OU
mictv telugu

దారుణం.. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి

September 25, 2022

ప్రేమోన్మాదులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ముషీరాబాద్ బోలక్‌పూర్‌కు చెందిన ఓ యువతి, రంజిత్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. శనివారం సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్ సమీపంలో ఇద్దరు కలుసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.

ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవ జరగడంతో ఆగ్రహానికి లోనైన రంజిత్.. పదునైన ఆయుధంతో యువతిపై దాడి చేశాడు. ఆమె చేతికి బలమైన గాయాలు అయ్యాయి. దాడి చేసిన అనంతరం రంజిత్ అక్కడి నుంచి పారిపోయాడు. హాస్టల్లో ఉన్న విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని కాచిగూడలోని ఫాతిమా హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న రంజిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమె కుడి చేతికి గాయం కావడంతో వైద్యులు చికిత్స చేశారు. తప్పించుకున్న రంజిత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఓయూ ఇన్స్పెక్టర్ రమేశ్ నాయక్ తెలిపారు.