నమ్మించి చంపేశారు.. ఎన్‌కౌంటర్ చేయండి : అవంతి రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

నమ్మించి చంపేశారు.. ఎన్‌కౌంటర్ చేయండి : అవంతి రెడ్డి

September 25, 2020

c c vn

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన పరువు హత్యలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య సమయంలో జరిగిన విషయాలను హేమంత్ భార్య అవంతి రెడ్డి వివరించింది. తన కుటుంబ సభ్యులు నమ్మించి చంపేశారని  వెల్లడించింది. ‘ఇంటికి తీసుకెళ్తామని చెప్పి, కారులో ఎక్కించుకొని హత్యకు ప్లాన్ వేశారు. ఇంటికి వెళ్లే రూట్ కాకుండా మరో మార్గంలో కారు వెళ్తుండగా అనుమానం రావడంతో కిందకు దూకేశాం. కానీ బలవంతంగా హేమంత్‌ను కారులో తీసుకెళ్లి కొట్టి దారుణంగా హత్య చేశారు. సాయం కోసం అరిచినా ఒక్కరు ముందుకు రాలేదు’ అని కన్నీరు పెట్టుకుంది. 

కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని లక్ష్మారెడ్డి అనే వ్యక్తి తన బావమర్ధి, ఇతర బంధువులతో కలిసి హత్యకు ప్లాన్ వేశాడు.  గొడవలు వద్దని, ఇంటికి రావాలని చెప్పి తన మేనమామ యుగంధర్ రెడ్డి, మిగతా వారు కలిసి వచ్చి కిడ్నాప్ చేశారని తెలిపింది. హేమంత్‌ను చంపిన వారిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేసింది. కాగా ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్న హేమంత్, అవంతి ఈ ఏడాది జూన్ 10వ తేదీన పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.