నిందితులకు ఉరిశిక్ష వెయ్యాలి.. మోదీకి కేటీఆర్ ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

నిందితులకు ఉరిశిక్ష వెయ్యాలి.. మోదీకి కేటీఆర్ ట్వీట్

December 1, 2019

అత్యాచారం చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్, ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్ చేశారు. పశు వైద్యాధికారిణి డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసు ఘటనపై ఆయన మోడీకి ట్వీట్ చేశారు. ట్వీట్‌లో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ఉరి శిక్షపై మళ్లీ సమీక్షకు వెళ్లే అవకాశం ఉండకూడదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. IPC, CRPC చట్టంలో మార్పులు తేవాలని పేర్కొన్నారు. నిర్భయ అత్యాచారం జరిగి ఏడు సంవత్సరాలైనా ఇంకా నిందితులకు ఉరిశిక్ష పడలేదనే విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. 9 నెలల పాపపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి దిగువ కోర్టు ఉరి వేస్తే…హైకోర్టు జీవిత ఖైదుగా మార్చిందని వెల్లడించారు. 

దుమ్ముపట్టిన చట్టాలను మార్చాల్సిన సమయం వచ్చిందని కోరారు. చట్టానికి భయపడని మానవ మృగాల నుంచి దేశానికి రక్షించేందుకు కృషి చేద్దామని అన్నారు.