జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. బెయిల్‌పై విడుదలైన నిందితులు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు మైనర్లకు బెయిల్ మంజూరైంది. జువైనల్ జస్టీస్ బోర్డు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ముగ్గురు నిందితులు సైదాబాద్‌లోని జువైనల్ హోమ్ నుంచి విడుదల అయ్యారు. అయితే ఎమ్మెల్యే కుమారుడు మాత్రం ఇంకా జువైనల్ హోమ్‌లోనే ఉన్నాడు. నిందితులు గతంలో రెండుసార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టివేసింది. తాజా పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు షరతులకు కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఒక్కో నిందితుడికి రూ.5వేల పూచీకత్తుతో పాటు, పోలీసులు ఎప్పుడు పిలిచినా హాజరై విచారణకు సహకరించాలని హైకోర్టు షరతులు విధించింది. హైదరాబాద్ డీపీవో ముందు ప్రతి నెల హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు జువైనల్ హోమ్‌లో ఉన్న ఎమ్మెల్యే కుమారుడి జువైనల్ బోర్డు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. హైకోర్టు ఆ పిటిషన్‌ని పెండింగ్‌లో ఉంచడంతో అతడు ఇంకా జువైనల్ హోమ్‌లోనే ఉండిపోయాడు. నేడు హైకోర్టులో ఐదో బాలుడి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మే 28న జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని అమ్నీషియా పబ్‌కు వచ్చిన బాలిక(17)ను కొందరు మైనర్లు ఇంటి వద్ద దించుతామని నమ్మించి కారులో తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన విదితమే. నిందితులైన సాదుద్దీన్ మాలిక్(19)తోపాటు మరో అయిదుగురు బాలురను అరెస్ట్ చేశారు. వీరిలో సాదుద్దీన్ చంచల్‌గూడ జైలులో శిక్షను అనుభవిస్తుండగా మిగిలిన బాలురను జువైనల్ హోంకి తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో నిందితుడైన సాదుద్దీన్ మాలిక్‌కు కోర్టు బెయిల్ తిరస్కరించింది.