Hyderabad: Liquor shops to be close for two days in view of Holi
mictv telugu

మందుబాబులకు షాక్.. హోలీ సందర్భంగా వైన్ షాపులు క్లోజ్

March 5, 2023

Hyderabad: Liquor shops to be close for two days in view of Holi

ఈ వారంలోనే హోలీ పండుగ. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు మందుబాబులకు షాక్ ఇచ్చారు. హోలీ పండుగ సందర్భంగా షాపులను రెండు రోజుల పాటు బంద్ చేయించనున్నారు. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులను మూసివేయించనున్నారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ ప్రకటించారు. హైదరాబాద్ నగర పీఎస్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. జంట నగరాల పరిధిలో 48 గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు.

అదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. సంబంధం లేని వ్యక్తులపై రంగులు వేయొద్దని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హోలీ వేడుకల్లో పాల్గొనే వారు.. ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, గుంపులు గుంపులు తిరుగుతూ.. న్యూసెన్స్ చేయవద్దని సూచించారు. మూడు పోలీస్ కమిషనరేట్స్ పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. సోమవారం సాయంత్రం 06 గంటల నుంచి బుధవారం ఉదయం 06 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అవుతుండడంతో మద్యం ప్రియులు వైన్స్ షాపుల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దీంతో వైన్స్ షాపులు కిటకిటలాడుతున్నాయి.