అదరగొట్టిన హైదరాబాద్.. ఓడిన గుజరాత్ - MicTv.in - Telugu News
mictv telugu

అదరగొట్టిన హైదరాబాద్.. ఓడిన గుజరాత్

April 12, 2022

06

ఐపీఎల్ మ్యాచ్‌లు పోటాపోటిగా సాగుతున్నాయి. ఒక జట్టులో బౌలర్లు రెచ్చిపోయి వికెట్లను పడగొడుతుంటే, మరో జట్టులో యువ బ్యాట్స్‌మెన్స్ సిక్సర్ల మీద సిక్సర్లను బాదుతూ, జట్టును విజయం దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతరాత్రి హైదారాబాద్ సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. గుజరాత్ టైటాన్స్‌ను హైదరాబాద్ చిత్తు చిత్తుగా ఓడించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్‌కు సన్ రైజర్స్ బ్రేకులు వేసింది.

మొదటగా టాస్ నెగ్గిన హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన.. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి, 162 పరుగులు చేసింది. పాండ్య (50 నాటౌట్; 42 బంతుల్లో 4×4, 1×6) అర్ధ శతకంతో ఆదుకున్నాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. తొలుత ఓపెనర్లు అభిషేక్ శర్మ (42), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (57) సరైన పునాది వేయగా, చివర్లో నికోలాస్ పూరన్ (18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 34 నాటౌట్) అద్భుతమైన ముగింపునిచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేన్ విలియమ్సన్ ఎంతో ఓపికగా ఆడి, అవసరమైనప్పుడు దూకుడు ప్రదర్శిస్తూ ఎక్కడా రన్ రేట్ తగ్గకుండా చూశాడు. విలియమ్సన్ స్కోరులో 2 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. ఈ న్యూజిలాండ్ ఆటగాడికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.