హైదరాబాద్‌లో పరువు హత్య.. ప్రణయ్ ఘటన తలపించేలా - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో పరువు హత్య.. ప్రణయ్ ఘటన తలపించేలా

September 25, 2020

ngvhn

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య తరహాలో హైదరాబాద్ నగరంలోనూ జరిగింది. కూతురు ప్రేమ వివాహం ఇష్టం లేని ఓ తండ్రి అల్లుడిని కిరాయి మనుషులతో హత్య చేయించాడు. శుక్రవారం ఉదయం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సినిమా తరహాలో కిడ్నాప్ చేసి చంపేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.  

చందానగర్‌లో ఉండే హేమంత్ అనే యువకుడు ఇదే ప్రాంతానికి చెందిన అవంతి రెడ్డిని ప్రేమించాడు. ఈ క్రమంలో అమ్మాయి తండ్రి లక్ష్మారెడ్డి దీనికి ఒప్పుకోలేదు. ఇంట్లో చెప్పకుండా ఆమె హేమంత్‌ను పెళ్లి చేసుకుంది. కొన్నిరోజులుగా వీరిద్దరూ గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఉంటున్నారు. అప్పటి నుంచి కోపంతో రగిలిపోయిన లక్ష్మారెడ్డి అల్లుడిపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కిరాయి మనుషులతో బేరం కుదుర్చుకున్నాడు. గురువారం మధ్యాహ్నం కారులో వచ్చిన దుండగులు వీరిని కిడ్నాప్ చేశారు. ఆ క్రమంలో అవంతి తప్పించుకోగా.. హేమంత్‌ను చంపేశారు. యువతి డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇచ్చే లోపే ఇదంతా జరిగిపోయింది.