న్యూజిలాండ్ ఉగ్రదాడిలో హైదరాబాదీకి గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

న్యూజిలాండ్ ఉగ్రదాడిలో హైదరాబాదీకి గాయాలు

March 15, 2019

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ పట్టణంలో జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. 49 మంది మరణించారని, 3 మందికిపైగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషయమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు.

కాల్పుల్లో హైదరాబాద్ నగరానికి చెందిన అహ్మద్ జహంగీర్ గాయపడ్డాడ్డాని ఎంపీ అసదుద్దీన్ వెల్లడించారు. జహంగీర్ సోదరుడు ఖర్షీద్ న్యూజిలాండ్ వెళ్తున్నాడని, అతనికి సాయం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఒవైసీ ట్విటర్లో కోరారు. కాల్పుల వీడియో ఫుటేజీలో జహంగీర్‌పై కాల్పులు జరిగినట్లు తెలుస్తోందన్నారు. తమ పార్టీ ఎన్నారై విభాగం సాయం చేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.