సీఎం భార్య మేనల్లుడిని..ట్రాఫిక్ పోలీసుపై యువకుడి హల్‌చల్ - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం భార్య మేనల్లుడిని..ట్రాఫిక్ పోలీసుపై యువకుడి హల్‌చల్

January 16, 2020

Hyderabad

ట్రాఫిక్ పోలీసులకు చిక్కగానే పెద్ద పెద్ద నేతల పేర్లు చెప్పి బుకాయించడం పరిపాటిగా మారిపోయింది. గతంలో మద్యం తాగి దొరికిపోయి ఓ యువకుడు మాజీ ఎంపీ కవిత పేరు వాడుకొని హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్ భార్య శోభ మేనల్లుడిని అంటూ మరో వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వారికి చట్టం గురించి క్లాస్ తీసుకుంటూ.. వారిని బెధించే ప్రయత్నం చేశాడు. హైదరాబాద్‌లో గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

సీఎం భార్య మేనల్లుడిని..ట్రాఫిక్ పోలీసుపై యువకుడి హల్‌చల్

Publiée par Satyavathi Satya sur Jeudi 16 janvier 2020

నెరెడ్మెట్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు తనఖీలు చేపట్టారు. ఈ సమయంలో అటుగా TS16UB 5620 ఓ వ్యక్తి ఎలాంటి పత్రాలు లేకుండా పట్టుబడ్డాడు. అలా పోలీసులు తనను ఆపి తనిఖీలు చేయడంపై మండిపడ్డాడు.‘నేను సీఎం భార్య మేనల్లుడిని నేను తలుచుకుంటే ఏమైనా చెయ్యగలను. నేనేం దొంగను కాదు.. మీరు కోర్టులో కేసు వేసినా.. నేనే గెలుస్తా. ఎవరైనా అనుమానితులు ఉంటే.. వాడు దొంగా.. లేదా అన్నది  తెలుసుకోవాలి. నేనేం అలాంటి వాన్ని కాదు కదా.. అంటూ వీర లెవల్లో రెచ్చిపోయాడు. దీంతో అతన్ని సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు కారు సీజ్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ కారు రిక్కా జాకోబ్ అనే వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తేలింది.