లండన్‌లో హైదరబాదీ హత్య - MicTv.in - Telugu News
mictv telugu

లండన్‌లో హైదరబాదీ హత్య

May 10, 2019

లండన్‌లో‌ దారుణం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన నదీముద్దీన్ అనే యువకుడిని లండన్‌లో తన సహా ఉద్యోగి దారుణంగా హత్య చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లండన్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో ఉద్యోగం చేస్తున్న నదీమ్‌ను.. సహ ఉద్యోగి అయిన పాకిస్తానీ హత్య చేశాడని అతడి తండ్రి ఆరోపిస్తున్నారు. పాతబస్తీలోని నూర్‌ఖాన్ బజార్‌కు చెందిన నదీమ్ ఆరేళ్లుగా లండన్‌లో నివసిస్తున్నాడు.

Hyderabad man stabbed to death in London.

ఇటీవల మాల్ మూసివేసిన తర్వాత కూడా నదీమ్ ఇంటికి చేరుకోకపోవడంతో.. అతని భార్య షాపింగ్ మాల్ నిర్వాహకులకు ఫోన్ చేసింది. దీంతో సెక్యురిటీతో మాల్ నిర్వాహకులు అంతా వెతికించగా.. వారికి నదీమ్ మృతదేహం కారు పార్కింగ్ ప్రదేశంలో లభ్యమైనది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.