హైదరాబాద్ మేయర్, ఉప మేయర్ ఎవరో తేలిపోయింది. బల్దియా అగ్రపీఠాన్ని మహిళ దక్కించుకుంది. ఉప మేయర్ పదవి కూడా మహిళకే దక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక హైదరాబద్ మేయర్ పదవి మహిళకు దక్కడం ఇదే తొలిసారి. టీఆర్ఎస్ ఎంపీ, కె.కేశవ కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మిని మేయర్ పదవికి సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ఉప మేయర్ పోస్ట్ ను తార్నక కార్పొరేటర్ మోతే శ్రీలత దక్కించుకున్నారు.
ఈ రోజు కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఎంఐఎం మద్దతులో రెండు కీలక పదవులను టీఆర్ఎస్ దక్కించుకుంది. మరోపక్క.. మేయర్ పదవి తనకు దక్కలేదన్న ఆవేదనతో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. డిసెంబర్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అతిపెద్దగా పార్టీగా అవతరించడం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ 56 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 44 స్థానాల్లో గెలుపొందింది. ఎంఐఎం పార్టీ 44 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకే పరిమితమైంది.