Hyderabad Meteorological Center has announced heavy rains will occur in Telangana
mictv telugu

హైదరాబాద్‌లో మళ్లీ జోరు వాన… భారీ ట్రాఫిక్ జామ్

September 29, 2022

Hyderabad Meteorological Center has announced heavy rains will occur in Telangana

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్ పేట, కూకట్ పల్లి, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్దఅంబర్ పేట, చంపాపేట, సరూర్ నగర్ లో భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్ లో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

మరోవైపు తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. కొమురుం భీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం రాష్ట్రంలోని చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.