తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటికే రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. గతంలో కురిసిన వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఇదిలా ఉంటే ఈరోజు సాయంత్రం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పలు చోట్ల మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కొమురంభీం, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, రాజన్నసిరిసిల్ల, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో మెరుపులతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగతా జిల్లాలో అక్కడక్కడ ఉరుపులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.