మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

November 22, 2019

మెట్రో ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ వినిపించింది. ఇక నుంచి నాగోల్ – హైటెక్ సిటీ కారిడార్‌లో మార్గాన్ని మరింత పెంచారు. ఇప్పటి వరకు హైటెక్ సిటీ వరకే పరిమితమైన రైళ్లు  ఇక నుంచి మైండ్ స్పేస్ వరకు వెళ్లనున్నాయి. ఈనెల 29 నుంచి ఈ సేవలు ప్రారంభంకానున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల సౌకర్యం కోసం మరింత దూరాన్ని పెంచారు. తాజా నిర్ణయంతో ఐటీ ఉద్యోగుల ప్రయాణానికి మరింత కలిసి వచ్చే అవకాశంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Hyderabad Metro Corridor.

ఇప్పటి వరకు చలా మంది ఉద్యోగులు రైల్వే స్టేషన్ దగ్గర దిగి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నుంచి ఆ సమస్య లేకుండా మైండ్ స్పేస్ వద్ద నేరుగా తమ ఆఫీసుల వద్దే దిగే అవకాశం దక్కింది. ఇక మెట్రో కారిడార్‌-2 నిర్మాణ పనులు కూడా దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు ఉన్న 10 కిలోమీటర్ల మార్గాన్ని వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో నగరంలో ప్రయాణం మరింత సులువు కాబోతోంది.