మెట్రో ప్రయాణికులకు సూపర్ ఆఫర్! - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రో ప్రయాణికులకు సూపర్ ఆఫర్!

December 6, 2017

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికుల ఆదరణతో మురిసిపోతోంది. వారిని మరింతగా ఆకట్టుకోవడానికి మెట్రో డిస్కౌంట్ ప్రకటించింది. స్మార్ట్ కార్డు కొనుగోలు చేసిన వారికి వచ్చే ఏడాది మార్చి 31 వరకు టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇస్తామని బుధవారం తెలిపింది.అలాగే  పేటీఎం ద్వారా స్మార్ట్ కార్డును రీఛార్జ్ చేసుకునే వారికి రూ. 20 క్యాష్ బ్యాక్ ఇస్తామని వివరించింది. ఈ కార్డులను టీసవారీ, పేటీఎం, హెచ్ఎంఆర్ ప్యాసింజర్ వెబ్‌సైట్‌ల ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. మెట్రోలో ప్రస్తుత రోజూ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ రైళ్లు పరుగులు పెడుతున్నాయి.  మియాపూర్, నాగోల్, అమీర్‌పేటలో తొలి రైలు పొద్దున ఆరు గంటలకు వెళ్తుంది రాత్రి పది గంటలకు ఈ స్టేషన్లోనే చివరి రైలు బయల్దేరుతుంది. కాగా, మియాపూర్-అమీర్‌పేట మధ్య ప్రతి 8 నిమిషాలకు రైలును నడుపుతున్నారు. నాగోల్-అమీర్‌పేట మధ్య 16 నిమిషాలకు ఒక రైలు తిరుగుతోంది. మెట్రో మొదలై వారం దాటినా రద్దీ తగ్గడం లేదు. చాలామంది మెట్రో అనుభవాన్ని ఆస్వాదించడానికి వెళ్తున్నారు.