హైదరాబాద్ మెట్రో ఆల్ టైమ్ రికార్డ్ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ మెట్రో ఆల్ టైమ్ రికార్డ్

October 22, 2019

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలు మెట్రో రైలును సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. దీంతో మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. వారానికి 5 వేల మంది ప్రయాణికులు పెరుగుతున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ మెట్రో రైళ్లలో ప్రస్తుతం రోజూ సరాసరి 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.

Hyderabad metro.

తాజాగా సోమవారం హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్టు సృష్టించింది. మెట్రో రైళ్లలో ఒక్క రోజే 4 లక్షల మందికి పైగా ప్రయాణించారు. మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇదే అత్యధికమని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో మెట్రో‌ రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్కువ సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపారు. ప్రతి 3.5 నిమిషాలకు ఒక రైలును నడుపుతున్నట్లు తెలిపారు. సోమవారం ఒక్క రోజే 830 ట్రిప్పులు నడిపినట్లు వెల్లడించారు.