మెట్రో ప్రయాణికులకు శుభవార్త..  - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. 

April 20, 2018

నత్తనడక నడుస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికుల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచింది. ఇక నుంచి మియాపూర్‌-అమీర్‌పేట్‌-నాగోల్‌ మధ్య రద్దీ సమయాల్లో 7 నిమిషాలకో మెట్రో రైలును నడపనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ స్వయంగా ట్విటర్లో తెలిపారు. శనివారం ఉదయం నుంచి రద్దీ సమయాల్లో 7 నిమిషాలకోసారి రైలు ప్రజలకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.మియాపూర్-అమీర్‌పేట్-నాగోల్ రూట్లో రద్దీ ఉన్నప్పుడు ఉదయం 6 గంటల నుంచి ప్రతి 7 నిమిషాలకు ఒక మెట్రో రైలు, రద్దీ లేనప్పుడు  ప్రతి 8 నిమిషాలకు ఓ రైలు నడుస్తుందని, కొత్త సిగ్నలింగ్ వ్యవస్థకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్) అనుమతి ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఈ రూట్లో ప్రస్తుతం ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు నడుస్తోంది. అయితే అంత వ్యవధి వరకు జనం వేచిచూడలేక, బస్సులను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు.