హైదరాబాద్ మెట్రోరైల్ ప్రయాణీకులకు ఇంతకు ముందెన్నడూ లేని ఆఫర్ ప్రకటించింది. ‘సూపర్ సేవర్ కార్డు’ పేరుతో తీసుకొచ్చిన కొత్త ఆఫర్‌తో సెలవు రోజుల్లో కేవలం రూ. 59తో రోజంతా మెట్రోలో ప్రయాణించవచ్చు. నగరంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా తిరగవచ్చని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కె.వి.బి. రెడ్డి ప్రకటించారు. మెట్రో అధికారులు ప్రకటించిన వంద సెలవు రోజుల్లో ఈ ఆఫర్ చెల్లబాటు అవుతుందని వెల్లడించారు. కాగా, కరోనా ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గి ఆక్యుపెన్సీ పడిపోయిన నేపథ్యంలో మెట్రో తీసుకొచ్చిన ఈ ఆఫర్ ఏ మేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.