జేబీఎస్-ఎంజీబీస్ మెట్రో ట్రయల్ రన్ సక్సెస్  - MicTv.in - Telugu News
mictv telugu

జేబీఎస్-ఎంజీబీస్ మెట్రో ట్రయల్ రన్ సక్సెస్ 

November 25, 2019

Hyderabad metro rail jbs mgbs line trail run success 

హైదరాబాద్‌ నగరవాసులకు మరో మెట్రో రైలు మార్గం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ రోజు అధికారులు జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రో ట్రయల్‌ రన్‌ ను విజయవంతంగా నిర్వహించారు. రెండు రైళ్లతో ట్రయల్‌ రన్‌ నిర్వహించామని మెట్రో రైల్ ఓ ప్రకటనలో తెలిపింది. 

డిసెంబర్‌ నుంచి జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో నగరంలోని రెండు కీలక బస్ట్ స్టేషన్లకు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ కు రాకపోకలు సులభంగా సాగనున్నాయి. జేబీఎస్-ఫలక్‌నుమా(మెట్రో కారిడార్ 2)లో భాగమైన ఈ లైన్ ఫలక్ నుమా వరకు సాగుతుంది. జేబీఎస్-ఎంజీబీస్ మార్గంలో జేబీఎస్ పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, నారాయణ గూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీస్ స్టేషన్లు ఉన్నాయి. జేబీఎస్ నుంచి ఎంజీబీస్ రన్ 16 నిమిషాల్లో పూర్తయింది. రోడ్డు మార్గంలో వెళ్లాలంగే 45 నిమిషాలు పడుతుంది. ట్రయల్ రన్‌లో మెట్రో అధికారులు ఎన్వీఎస్ రెడ్డి, కేవీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిగ్నలింగ్, బ్రేక్, అనౌన్స్ మెంట్స్, డిస్ ప్లే టెస్ట్, డమ్మీ ప్యాసింజ్ ఎవాకుయేషన్ తదితర పరీక్షలు పూర్తి చేశారు.