నష్టాల్లో ఉన్నాం, ఎవరైనా పెట్టుబడి పెట్టండి : మెట్రో ఎండీ - MicTv.in - Telugu News
mictv telugu

నష్టాల్లో ఉన్నాం, ఎవరైనా పెట్టుబడి పెట్టండి : మెట్రో ఎండీ

April 21, 2022

mmmmmm

హైదరాబాదు నగరంలో రెండో ఫేజ్ మెట్రో నిర్మాణంలో ఎవరైనా భాగస్వాములుగా చేరవచ్చని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆఫరిచ్చారు. గురువారం పరేడ్ గ్రౌండ్ వద్ద ఎలక్ట్రిక్ ఆటోలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ ఆటోలలో మిగతా ఆటోల కన్నా తక్కువ ఛార్జీతో ప్రయాణం చేయవచ్చు. ‘మెట్రో రైడ్’ పేరుతో ఈ వాహనాలను ప్రారంభిస్తున్నాం. అలాగే ఫేజ్ 2 మెట్రో ప్రాజెక్టుకు సిద్ధంగా ఉన్నాం. శంషాబాద్ వరకు మెట్రో కనెక్షన్ కొరకు రూ. 5 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కరోనాతో హైదరాబాద్ మెట్రో రైల్ బాగా నష్టపోయింది. రూ. 3 వేల కోట్లు నష్టం వచ్చినా ఎల్ అండ్ టీ మధ్యలో వదిలేయకుండా నిర్వహిస్తోంది’ అని వెల్లడించారు.