Hyderabad Metro Services suspended on the LBnagar-Miyapur route were for more than 40 minutes.
mictv telugu

హైదరాబాద్‌ మెట్రో సేవలకు అంతరాయం.. ఏకంగా 40 నిమిషాల పాటు

November 11, 2022

ఎలాంటి ట్రాఫిక్ చిక్కుల్లో ఇరుక్కోకుండా, సరైన సమయానికి గమ్యస్థానానికి చేరుకోవాలంటే హైదరాబాదీల బెస్ట్ ఆప్షన్ హైదరాబాద్ మెట్రో. ఈ మధ్య ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగి, ప్రస్తుతం నడుపుతున్న మెట్రో రైళ్లు కూడా సరిపోవడం లేదు. అయితే కొంత కాలంగా.. మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈరోజు కూడా ఏదో టెక్నికల్ ప్రాబ్లెం కారణంగా మెట్రో ట్రైన్ మియాపూర్ – ఎల్బీనగర్ మార్గంలో ఏకంగా 40 నిమిషాల పాటు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొన్నారు.

ఉదయం 11 గంటల సమయంలో మియాపూర్ నుంచి ఎల్బీనగర్‌ వస్తున్న మెట్రో రైలు.. ఖైరతాబాద్‌ స్టేషన్‌లో నిలిచిపోయింది. దీంతో ఈ మార్గాల్లో వెళ్తున్న రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపేశారు. దీంతో ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, అమీర్‌పేట్‌ తదితర స్టేషన్లలో రైళ్లు ఆగిపోయాయి. కొన్ని రైళ్లు మార్గంమధ్యలోనూ ఆగినట్లు సమాచారం. రైళ్లు తిరిగి బయల్దేరేందుకు కాస్త సమయం పడుతుందని మెట్రో సిబ్బంది అనౌన్స్‌ చేస్తున్నారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక లోపంతోనే సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. దీనిపై మెట్రో రైలు అధికారులు స్పందించాల్సి ఉంది.