అర్థరాత్రి వరకు మెట్రో సేవలు.. నిమజ్జనం స్పెషల్ - MicTv.in - Telugu News
mictv telugu

అర్థరాత్రి వరకు మెట్రో సేవలు.. నిమజ్జనం స్పెషల్

September 12, 2019

Metro .....

భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్‌కు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వారి కోసం అటు ఆర్టీసీ ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకునేందుకు మెట్రోరైళ్ల సమయాన్ని కూడా పెంచారు. అర్థరాత్రి వరకు వీటి సేవలు కొనసాగించి తర్వాత అవసరానికి అనుగుణంగా రైళ్లను నడపనున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీరెడ్డి తెలిపారు. 

సాధారణంగా మియాపూర్, ఎల్బీనగర్ నుంచి రాత్రి పదిన్నర గంటల వరకే చివరి మెట్రో రైళ్లను నడుపుతున్నారు. కానీ నిమజ్జనం కారణంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే వారి సౌకర్యార్థం ప్రతీ నాలుగున్నర నిమిషాలకో రైలును నడపనున్నారు. ఇప్పటికే నవరాత్రుల సందర్భంగా వేలాది మంది భక్తులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. మెట్రోలో సులభంగా గమ్యాన్ని చేరవేసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు.