కరోనా లాక్డౌన్ వల్ల చాలా సంస్థల ఆదాయానికి భారీగా గండి పడిపోయింది. తిరిగి పుంజుకోడానికి భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో కూడా ఇప్పటికే పలు రాయితీలు ప్రకటించింది. తాజాగా ఏకంగా 50 శాతం క్యాష్ అంటూ ముందుకొచ్చింది.
ఆదివారం నుంచి నుంచి మెట్రో స్మార్ట్ రీచార్జీలపై 50 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అమల్లోకి రానుంది. ఆన్లైన్లో రీచార్జీ చేసుకునే వారికే ఇది అందుబాటులో ఉంటుంది. రీచార్జి మొత్తాన్ని 90 రోజుల్లో వాడుకోవాలి. అయితే డిస్కౌంట్ గరిష్టంగా రూ. 600 వరకు మాత్రమే అభిస్తుంది. ఉదాహరణకు రూ. 1500 స్మార్ట్ కార్డులో రీచార్జీ చేయించుకుంటే 600 క్యాష్ బ్యాక్ జతకలిసి రూ. 2100 బ్యాలన్స్ మన కార్డులో జమ అవుతుంది. అన్ లాక్ మొదలు కాగానే మెట్రో తన ప్రయాణికుల కోసం చార్జీలు కొంత తగ్గించింది. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా ఛార్జీలపై 40 శాతం డిస్కౌంట్ ఇచ్చిది. సువర్ణ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ వల్ల ప్రయాణికులు సంఖ్య 30 శాతం పెరిగిందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రోజూ లక్షా 30 వేల మంది వరకు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు వివరించారు.