అమీర్ పేట్ టు ఎల్బీనగర్… ఛలో మెట్రో - MicTv.in - Telugu News
mictv telugu

అమీర్ పేట్ టు ఎల్బీనగర్… ఛలో మెట్రో

September 24, 2018

నగరవాసులకు మరొక శుభవార్త. సిటీలో దూర ప్రయాణాన్ని మరింత సులువు చేసే క్రమంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మెట్రోను రూపొందిస్తోంది. అమీర్ పేట నుంచి ఎల్బీ నగర్ మెట్రో రైలు మార్గాన్ని ఇవాళ మధ్యాహ్నం 12.15కు ప్రారంభించనున్నారు. చాలా రోజులుగా ఊరడిస్తున్న ఈ మార్గంలో ప్రయాణం ఇకనుంచి చాలా సులువు కానుంది.Ameerpet, LB Nagar, Metro గవర్నర్ నరసింహన్ అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో కొత్త కారిడార్‌ను ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. 16 కిలోమీటర్ల మేర ఈ మెట్రో రైలు మార్గం అందుబాటులోకి రానుంది. ఈ 16 కిలోమీటర్ల దూరంలో 17 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఎల్బీ నగర్ నుంచి అమీర్ పేట రావాలంటే ట్రాఫిక్‌తో యుద్ధం చేసినంత పనే అయ్యేది. ఇకనుంచి ప్రయాణీకులకు అలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, సమయం వృధా కాకుండా మెట్రోలో ఎంచక్కా వెళ్లిపోవచ్చని ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.