హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పెరగనున్న మెట్రో ఛార్జీలు! - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పెరగనున్న మెట్రో ఛార్జీలు!

October 31, 2022

Hyderabad metro train fares are likely to hike

హైదరాబాద్‌లో మెట్రో రైలు ఛార్జీలు పెరగనున్నాయి. హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ అభ్యర్థన మేరకు ఛార్జీల సవరణకు కేంద్ర ప్రభుత్వం ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ(ఎఫ్‌ఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి హైకోర్టు రిటైర్డ్ జడ్జీ న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్‌ ప్రసాద్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుత ఛార్జీల సవరణకు సంబంధించి తమ అభిప్రాయలను నవంబరు 15లోగా తెలపాలని కమిటీ ఛైర్మన్ ప్రయాణికులను కోరారు. పలు ప్రాంతాలకు ఛార్జీల సవరణ కోసం ప్రయాణికుల నుంచి సలహాలను ఆహ్వానించారు.

అయితే ప్రయాణికులు మెట్రో ఛార్జీల సవరణపై సలహాలు, సూచనలు చేయోచ్చు. ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా నవంబర్ 11 లోపు సూచనలను పంపవచ్చు. ప్రయాణికులు తమ సూచనలను ఇమెయిల్ ద్వారా [email protected]కు పంపవచ్చు. పోస్ట్ ద్వారా చైర్మన్, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ, మెట్రో రైల్ భవన్, బేగంపేట, సికింద్రాబాద్-500003, తెలంగాణకు పంపాలి. పోస్ట్ నవంబర్ 15 లోపు చేరుకోవాలి.

అధిక డిమాండ్ కారణంగా హైదరాబాద్ మెట్రో రైల్ ఇటీవల సమయాన్ని పొడిగించింది. ఉదయం 6 గంటలకు మెట్రో రైలు ప్రారంభమవుతోంది. రాత్రి 11 గంటల వరకు ఉంది. అంతకుముందు రాత్రి 10.15 గంటల వరకే టర్మినల్‌ సేషన్ల నుంచి చివరి మెట్రో నడిచేది. అక్టోబర్ 10 నుంచి ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు రాత్రి సమయాల్లో మెట్రో టైమింగ్స్ మారాయి.