బాలికపై అత్యాచారం! ఎంఐఎం నేత అరెస్ట్   - MicTv.in - Telugu News
mictv telugu

బాలికపై అత్యాచారం! ఎంఐఎం నేత అరెస్ట్  

May 8, 2020

Hyderabad,MIM

హైదరాబాద్‌లో దళిత మైనర్ బాలికపై ఎంఐఎం పార్టీకి చెందిన నేత అత్యాచారం చేసిన ఘటన పెను దుమారాన్ని రేపుతోంది. చాదరఘాట్, కమలానగర్‌లో ఇటీవల షకీల్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో దళిత సంఘాలు, బీజేపీ నేతలు అన్ని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

అంతకు ముందు బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను  దళిత సంఘాలు, బీజేపీ నేతలు కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పాతబస్తీలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఈ సందర్భంగా బీజేపీ నేత, ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన షకీల్‌కు ఎంఐఎం నిందితుడికి అండగా ఉంటూ కేసును నీరుగార్చుతోందని ఆరోపించారు. కాగా విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే బలాల బాధితురాలి ఇంటికి వచ్చారు. కానీ స్థానికులు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి సర్ధి చెప్పి బాలికకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.షకిల్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.