హైదరాబాద్‌లో రైలు ప్రమాదం.. రెండు ట్రైన్లు ఢీ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో రైలు ప్రమాదం.. రెండు ట్రైన్లు ఢీ

November 11, 2019

హైదరాబాద్‌లో రెండు రైళ్లు ఢీ కొన్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఎంఎంటీఎస్, కర్నూలు ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఒకదానిని ఒకటి ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ప్రమాదం దాటికి ఎంఎంటీఎస్ రైలు పట్టాలు తప్పి ఒక పక్క ఒరిగిపోయింది. రైళ్ల రాకపోయకలకు అంతరాయం ఏర్పడింది. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు వచ్చి ఢీ కొన్నాయి. సిగ్నల్ చూసుకోకుండా ఒకే ట్రాక్ పై రావడంతో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు రైళ్లు వేగంగా ఉండటంతో ఇంజిన్ భాగం పూర్తిగా ఇరుక్కుపోయింది. అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.