సాటి మనిషిపైనే కాదు, కన్నబిడ్డలపైనా ప్రేమా, కరుణ అంతరించిపోతున్నాయి. మానసిక వైకల్యంతో పుట్టిన బిడ్డ తనకొద్దంటూ, చంపెయ్యాలంటూ భర్త వేధింపులకు పాల్పడ్డంతో భార్య బలవంతంగా ప్రాణం తీసుకుంది. బిడ్డ కోసం పరితపిస్తూ 22వ అంతస్తునుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మాటల్లో చెప్పలేని ఈ విషాదం ఆదివారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగింది.
Suggested: పది పాసైతే చాలు…నెలకు రూ.58,650జీతంతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు..!
నేమాని శ్రీధర్, స్వాతి దంపతులు. వీరి స్వస్థలం కాకినాడ. 2013లో పెళ్లయింది. మూడేళ్ల తర్వాత బిడ్డ పుట్టాడు. అయితే అతనికి మానసిక వైకల్యం ఉండడంతో శ్రీధర్ పట్టించుకోలేదు. ‘పిచ్చి పిల్లోడు’ తనకొద్దని, మెర్సీ కిల్లింగ్ ద్వారా చంపెయ్యాలని వేధిస్తుండడంతో స్వాతి కొడుకును సబ్బవరంలోని తన పుట్టింటికి తీసుకెళ్లి మూడేళ్లు అక్కడే ఉండిపోయింది. భర్తలో మార్పు వస్తుందని వేచిచూసింది. బిడ్డను ఎలాగైనా సరే వదిలించుకోవాలనుకున్న శ్రీధర్, అతణ్ని బాగా చూసుకుంటానని చెప్పడంతో స్వాతి నమ్మి హైదరాబాద్ వచ్చేసింది. శ్రీధర్ ప్రవర్తన మారలేదు. పిల్లాడిని వదిలించుకోవాలని శ్రీధర్ తోపాటు అత్తమామలు, ఆడపడచు వేధించారు. స్వాతి ఎవరికీ చెప్పుకోలేక, కొడుకును ఇంట్లోనే వదిలి అపార్టుమెంటులోని 22 అంతస్తుపై నుంచి దూకి అక్కడికక్కడే చనిపోయింది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్రీధర్‌ను విచారిస్తున్నారు.
ALSO READ: ‘నాతో చేతకాక.. నా కొడుకుపై కేసు పెట్టిస్తావా..?’ కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
మీరు సుకన్య సమృద్ధి స్కీంలో చేరాలనుకుంటున్నారా..అయితే మీకు గుడ్‌న్యూస్..!