Hyderabad: My channel is not getting likes..Student commits suicide
mictv telugu

హైదరాబాద్: నా ఛానల్‌కు లైక్స్ రావటం లేదు..విద్యార్థి ఆత్మహత్య

July 22, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. ఐఐటీ చదివే విద్యార్థి తన యూట్యూబ్ ఛాన‌ల్‌కు లైక్స్ రావటం లేదని, 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందకు తన యూట్యూబ్ ఛానల్‌కి ఎంతమంది వివర్స్ ఉన్నారో వారితో ముచ్చటించి, తన బాధను వారితో పంచుకున్నాడు. అనంతరం ఓ లేఖ రాసి గురువారం తెల్లవారుజామున భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం..”తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతానికి చెందిన చంద్రశేఖరన్, శంకరీ దంపతులు పదేళ్లుగా హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. చంద్రశేఖరన్ రైల్వే ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. శంకరీ డీఆర్‌డీవోలో శాస్త్రవేత్త. వీరు సైదాబాద్ డివిజన్ క్రాంతినగర్‌లోని ఆదర్మ్ ‘హైట్స్ రెండో అంతస్తులో ఉంటున్నారు. వీరికి ఒక్కడే కుమారుడు సి. దీనా (21) గ్వాలియర్‌లోని ఐఐఐటీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల పరీక్షలు రాసి, ఇంట్లోనే ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజామున అపార్టుమెంట్ అయిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏంటిన ఆరా తీస్తా.. తన ఛానల్‌కు లైక్స్ రావడం లేదని కలత చెంది, యూట్యూబ్‌లో తన బలవన్మరణానికి ముఖ్య కారణాలు పేర్కొన్నాడు” అని వివరాలను వెల్లడించారు.

ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో దీనా ఏం రాశాడో వివరించారు.”రాత్రంతా వీక్షకులతో మాట్లాడుతూ.. నా ఛానల్‌కు లైక్స్ రావడం లేదు. ఎందుకు? బుధవారం రాత్రి నుంచి యూట్యూబ్‌లోనే ఉంటా. నేను తయారు చేసిన ‘సెల్ఫ్‌‌లో గేమ్‌కు ఎందుకు లైక్స్ రావటం లేదు. కారణం ఏంటో అర్థం కావటం లేదు” అని తన బాధను వీక్షకులకు చెబుతూనే గురువారం తెల్లవారుజామున భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అతడు అందులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.