Hyderabad Narayana college student ablaze fee issue
mictv telugu

నారాయణ కాలేజీలో ఘోరం.. మంటల్లో విద్యార్థి, ప్రిన్సిపాల్‌..

August 19, 2022

హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో ఘోరం జరిగింది. రామంతాపూర్‌లోని కాలేజీలో ఒక విద్యార్థికి, ప్రిన్సిపాల్ మధ్య జరిగిన గొడవ మంటలకు దారితీసింది. ఫీజు కట్టాలని యాజమాన్యం వేధిస్తుండడంతో సందీప్ అనే విద్యార్థి ఆగ్రహం, ఆవేదనతో పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. తర్వాత ప్రిన్సిపాల్‌ను పట్టుకున్నాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మరో ఉద్యోగి కూడా గాయపడ్డినట్టు తెలుస్తోంది కాలేజీ సిబ్బంది మంటలు ఆర్పి, సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఉద్దేశపూర్వకంగానే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు కాలేజీ యాజమాన్యం చెబుతోంది.